Site icon TeluguMirchi.com

చిరుపైనే ఆశలన్నీ..ఏంచేస్తాడో ఏమో..?

మెగా స్టార్ చిరంజీవి పైనే ఆశలన్నీ పెట్టుకుంది సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. తెలుగు , తమిళ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ..గత ఏడాది వరుస హిట్లు అందుకొని అరా స్థానంలో నిలువగా..ఈ ఏడాది మాత్రం అమ్మడికి వరుస ప్లాప్స్ దెబ్బకొట్టాయి. దీంతో ఇక నయన్ పని అయిపోయినట్లే అని అంత మాట్లాడుకుంటున్నారు. అందుకే ఎలాగైనా సైరా సూపర్ హిట్ అయి అందర్నీ నోర్లు మూయించాలని కోరుకుంటుంది.

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సౌత్ తో పాటు నార్త్ లోను ఈ సినిమా విడుదల కాబోతుంది. అందుకే ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకుంది నాయన. బిగ్ బి , విజయ్ సేతుపతి , జగపతి బాబు , తమన్నా మొదలగు స్టార్ నటి నటులు నటిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణెదల ప్రొడక్షన్ ఫై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Exit mobile version