Site icon TeluguMirchi.com

న‌య‌న న‌హీ హై!

nayanపాపం.. తెలంగాణ స‌మ‌స్యకు ఓ ప‌రిష్కారం దొరికినా, బాల‌కృష్ణ సినిమాలో హీరోయిన్లు మాత్రం దొర‌క‌డం లేదు. ఎంత మంది పేర్లు ప‌రిశీలించారో, ఎంత‌మంది వ‌చ్చి, వెళ్లారో. అయినా ఇంకా ఎవ‌రూ క‌న్ఫామ్‌కాలేదు. చివరికి ఈ ప్రయాణం ఎక్కడైతే మొద‌లైందో అక్కడే ఆపారు. న‌య‌న‌తార‌ను అవున‌నుకొని త‌ర‌వాత మ‌ళ్లీ కాద‌నుకొని మ‌ళ్లీ న‌య‌న‌తార ద‌గ్గర‌కే వెళ్లార‌ని చెప్పుకొన్నారు. న‌య‌న ఒప్పేసుకొంద‌ని, బాల‌య్య – న‌య‌న్‌ల హ్యాట్రిక్ చిత్రం ఇదే అని కూడా అన్నారు. ఇప్పుడు న‌య‌న కూడా డ్రాప్ అయ్యింది. రూల‌ర్‌లో న‌య‌న‌తార న‌టించ‌డం లేదని, రెండో నాయిక ఇంకా క‌న్‌ఫామ్ కాలేద‌ని తాజా స‌మాచార‌మ్‌. మరి ఈ అన్వేష‌ణ కు ఎన్నాళ్లు ప‌డుతుందో..?

Exit mobile version