Site icon TeluguMirchi.com

‘స్పైడర్‌’తో నయన్‌కి సంబంధం ఏంటి?

క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా ‘స్పైడర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ క్లైమాక్స్‌ మినహా మొత్తం పూర్తి అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి రూపొందుతుంది. క్లైమాక్స్‌ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ తాజాగా చెన్నై చెక్కేశారు. అక్కడ క్లైమాక్స్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు గాను తాజాగా నయనతారను ఎంపిక చేసినట్టు ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. క్లైమూక్స్‌లో ఓ కీలక పాత్ర ఉంటుందట. దాన్ని పవర్‌ఫుల్‌ హీరోయిన్‌ అయితే బాగా చేయగలదు అని మురుగదాస్‌ ఈ పాత్రను అందాలతార నయనతారకు అప్పగించాని తెలుస్తోంది.

నయన్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్‌ ఉంది కాబట్టి చివరకు వచ్చే ఆ కీలక పాత్రలో నయన్‌ కనిపిస్తే చాలా ప్లస్‌ అవుతుంది అని దర్శకుడు భావించాడు. అందుకు మహేష్‌ కూడా ఒకే అనడంతో యూనిట్‌ నయన్‌ను సంప్రదించారు. నయన్‌కు మురుగదాస్‌ పట్ల ఉన్న అభిమానంతో ఈ చిత్రంలో నటించడానికి వెంటనే ఒకే చెప్పారు. పవర్‌ఫుల్‌గా సాగిపోయే ఈ చిత్రంలో నయన్‌ ఎలాంటి పాత్రలో చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్రంలో మహేష్‌ సరసన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version