Site icon TeluguMirchi.com

నయన్ తో “ఆ”… సంబంధం లేదు

Arya-Nayantharaనయన్, ఆర్య ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందని ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందని మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మీడియా లో జరిగిన తంతునంతా చూసిన ఆర్య ఈ వ్యవహారం పై ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘నయన్ నాకు స్నేహితురాలు మాత్రమే’ ‘ఈ మధ్య కొన్ని వెబ్ సైట్లు, పత్రికల్లో నయన్ ను పెళ్లి చేసుకుంటున్నాననే వార్తలొస్తున్నాయి. ఇవన్నీ అవాస్తవం. ఇక పెళ్లి విషయానికొస్తే భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేం. ప్రస్తుతానికి మాత్రం నయన్ నాకు గొప్ప ఆత్మీయురాలు’ అని మీడియాకు తెలిపాడు. ఇక నయన్ విషయానికొస్తే ఏ ముహూర్తాన ఇండస్ట్రీ లో అడుగుపెట్టిందో గాని ‘ప్రేమ’ బంధం తన సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో అనేక మలుపులు తిరుగుతోంది. విచిత్రం ఏమిటో గాని ఈ ప్రేమ గోల నాకొద్దురా బాబూ! అని నయన్ అంటున్నా ఆ బంధం మాత్రం నీడలా ఆమెను వదలటం లేదు. ఇప్పటికే ట్రయాంగిల్ లవ్ స్టోరీని నిజజీవితంలో చవి చూసిన నయనతార… ముందుముందు మరెన్ని యాంగిల్స్ చూస్తుందో.

Exit mobile version