నవీన్ చంద్ర హార్రార్‌ సస్పెన్స్‌ ‘షో టైం’ ఫస్ట్‌లుక్‌


షో టైమ్‌ నవీన్‌చంద్ర నటించిన మంచి పోలీస్‌ డ్రామా. భయానకంగా ఉండే ఓ పోలీసు కుటుంబానికి చెందిన డ్రామా అని చెప్పొచ్చు. ‘అందాల రాక్షసి’ సినిమాలో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పొందిన నవీన్ చంద్ర అద్భుతమైన కథతో మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్లీ తన ఖాతాలో సక్సెస్‌ వేసుకోనున్నారు. అయితే, ఈ షో టైమ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారం ఉగాది సందర్భంగా విడుదల చేశారు.స్కైలైన్‌ బ్యానర్‌ రూపొందిన ఈ మూవీకి కిశోర్‌ గరికపాటి నిర్మాణం చేపట్టారు. ఈ మూవీ నిర్మాణం చేపట్టారు

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల ఇద్దరు ఈ చిత్రంలో కపుల్స్‌గా నటిస్తున్నారు. ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీగా ఉండబోతుంది. ఓ పోలీసు కుటుంబానికి ఎదురైన కొన్ని భయానక పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తీశారు. అంటే మొత్తానికి ఓ భయానక డ్రామా అని చెప్పవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్లో నవీన్ చంద్ర, కామాక్షి ఉన్నారు. అయితే ఈ చిత్రానికి మదన్ దక్షిణామూర్తి డైరెక్షన్ చేశారు ఇక శేఖర్ చంద్ర సంగీతం నిర్వహించారు. ఎడిటింగ్ శరత్ కుమార్ చేశారు.

ఇక హీరో నవీన్ చంద్ర గతంలో కూడా కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాల్లో నటించారు. ఇక కామాక్షి భాస్కర్ల ‘మా ఊరి పొలిమేర’ సినిమాలో నటించింది’ అయితే షో టైం థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడానికి ఆసక్తికరమైన కథనంతో వచ్చామని డైరెక్టర్ తెలిపారు.ఈ చిత్రానికి మాటలు శ్రీనివాస్ గవిరెడ్డి చేయగా.. ఎడిటింగ్ శరత్ కుమార్ నిర్వహించారు. ఈ సినిమాకి చంద్రశేఖర్ మహాదాస్ పుష్యమిత్ర ఘంటా లైన్‌ ప్రొడక్షన్ బాధ్యతలు స్వీకరించారు.