Naveen Polishetty : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయకిగా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఈ చిత్రం నుండి ప్రీ వెడ్డింగ్ వీడియో ను రిలీజ్ చేసారు మేకర్స్.
ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో ఆధ్యంతం నవ్వులు పూయిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖేష్ మావయ్య నీకు వంద రీఛార్జ్ లు.. ఇప్పుడే మన అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను నువ్ ఫోన్ చేసావ్ అంటూ.. మొన్న పెళ్ళికి వచ్చిన సెలబ్రిటీల ఫోన్ నంబర్లు పెట్టు చెబుతా.. ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్.. వచ్చే ఏడాదంతా రాజుగారి వెడ్డింగ్ అంటూ నవీన్ పోలిశెట్టి మరోసారి తన స్టైల్ ఆఫ్ హ్యూమర్ తో అదరగొట్టేసాడు. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి కి కాబోయే భార్యగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇస్తుంది. వారిద్దరు కలిసి ఫోటోగ్రాఫర్ చెప్పినట్లుగా ఫోజులు ఇస్తూ సందడి చేశారు. మొత్తానికి ఈ వీడియో చూస్తుంటే నవీన్ కెరీర్ లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ కాబోతుందని అర్ధమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో చూసేయండి మరి.