Filmfare Awards : 6 ప్రెస్టిజియస్ విన్స్ తో నాని ‘దసరా’ మూవీ రికార్డు


Filmfare Awards South 2024 : నేచురల్ స్టార్ నాని హై-ఆక్టేన్ మాస్, యాక్షనర్ ‘దసరా’ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రిమార్కబుల్ ఇంపాక్ట్ ని చూపింది. ఏకంగా ఆరు వేర్వేరు విభాగాలలో అవార్డులు గెలుచుకొని రికార్డు క్రియేట్ చేసింది.

ధరణి క్యారెక్టర్ లో అదరగొట్టిన నాని ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వెన్నెల పాత్రలో అత్యద్భుతమైన నటనకు గానూ కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమాతోనే 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించి, ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న తొలి డెబ్యూ డైరెక్టర్‌గా సరికొత్త మైల్ స్టోన్ ని నెలకొల్పారు.

Also Read : Filmfare Awards : ఐదు అవార్డ్స్ తో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబి’

సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమా డైనమిక్ విజువల్స్‌ను అందించడంలో అసాధారణమైన వర్క్ కి గాను అవార్డు అందుకున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సినిమా సెట్స్, విజువల్ ఎన్విరాన్మెంట్ రూపొందించడంలో తన అద్భుతమైన పనితీరుతో అవార్డును అందుకున్నారు. ఎనర్జిటిక్, ఎంగేజింగ్ ధూమ్ ధామ్ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌ అవార్డ్ అందుకున్నారు. అలాగే గతేడాది నాని నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ దర్శకుడు శౌర్యువ్ కూడా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌అవార్డు అందుకోవడం విశేషం.

Also Read : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్..

అవార్డు అందుకున్న అనంతరం నాని మాట్లాడుతూ.. “ఒకప్పుడు నాకు చాలా అవార్డులు రావాలనే కోరిక ఉండేది, కానీ ఇప్పుడా ఆ కోరిక తగ్గింది. నాకు అవార్డుల కోసం ఇప్పుడు బలమైన కోరిక లేదు. ఇప్పుడు నా కోరికంతా నా దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, నా సినిమాల్లో పరిచయమైన కొత్త టాలెంట్‌లు, ఇతర ఆర్టిస్టులు అవార్డులు అందుకోవాలనే. అదే నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది. ఈ రోజు, శ్రీకాంత్, శౌర్యువ్ అవార్డులు గెలుచుకున్నందుకు నేను స్పెషల్ గా థ్రిల్ అయ్యాను. వారు కోరుకునే చోటికి చేరుకోవడానికి వారి ప్రయాణంలో ఒక చిన్న భాగమే నాకు గొప్ప అవార్డు. వారి తొలి అడుగుకు నేను ఒక చిన్న ఇటుక అయినా అందించినట్లయితే అది నాకు సరిపోతుంది. 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. దసరా, హాయ్ నాన్న చాలా ప్రత్యేకమైనవి” అని అన్నారు. నాని ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ తో వస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

69 శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 తెలుగు విజేతలు:

* ఉత్తమ చిత్రం: బలగం
* ఉత్తమ నటుడు: నాని (దసరా)
* ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
* ఉత్తమ దర్శకుడు వేణు యెల్దండి (బలగం)
* ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)
* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేష్ (బేబీ)
* ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)
* ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
* ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
* ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
* ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు.. సార్)
* ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
* ఉత్తమ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ (దసరా)
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)
* ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా.. దసరా)

Also Read :