Site icon TeluguMirchi.com

తెలుగు తెరపై మరో విదేశీ అందం

Nathalia (1)“అహ నా పెళ్ళంట”, “పూలరంగడు” వంటి కామెడీ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యువదర్శకుడు వీరభద్రం చౌదరి. తను ఇప్పుడు నాగార్జున వంటి ఓ పెద్ద స్టార్‌ ను డైరెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున హీరోగా వీరభద్రం దర్శకత్వంలో “భాయ్‌” చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ఓ విదేశీ సుందరి ఆడబోతున్నట్టు తెలిసింది. సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన “డిపార్ట్‌ మెంట్‌” చిత్రంలోని ఓ ఐటం సాంగ్‌ లో తన అందాలతో మత్తెక్కించిన నథాలియా కౌర్‌, ఇప్పుడు నాగార్జున్‌ “భాయ్‌” లో ఓ ప్రత్యేక గీతానికి నర్తించనుందట. ఈ దెబ్బతో టాలీవుడ్‌ లో కనీసం ఓ అరడజను అవకాశాలనైనా ఈ భామ తన అందాలతో కొల్లగొట్టేయడం గ్యారెంటీ అంటున్నారు డిపార్ట్‌ మెంట్‌ లో తన అందాలను చూసిన వారంతా!

Exit mobile version