Site icon TeluguMirchi.com

AAY : ‘ఆయ్’.. రిలీజ్ డేట్ వచ్చేసింది !

Nagarjuna : క్షమాపణలు చెప్పిన నాగార్జున..?

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు మేకర్స్.

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం పైకప్పు లీక్.. గర్భగుడిలోకి నీరు !

‘ఆయ్’ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఆగ‌స్ట్ 15న గురువారం, త‌ర్వాత రోజు నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. ఇక సోమ‌వారం రోజున ర‌క్షా బంధ‌న్ కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ కు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.

NKR21 : మళ్ళీ ‘వైజయంతి IPS’ గా విజయశాంతి.. ఫస్ట్ లుక్ అదుర్స్ !

Exit mobile version