Site icon TeluguMirchi.com

Aay First Look : ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చేలా ‘ఆయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్..

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టైటిల్ రివీల్‌ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.

Gaami : విశ్వక్ సేన్ ‘గామి’ పై రాజమౌళి స్పెషల్ పోస్ట్..

తాజాగా మేకర్స్ ‘ఆయ్’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే నార్నే నితిన్ తన స్నేహితులతో కనిపిస్తున్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ ఇందులో హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో నటించారు. మరో వైపు పచ్చదనంతో కూడిన సరస్సుని కూడా చూపిస్తున్నారు. అంటే ఈ చిత్రంలో ప్రకృతి కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

#AAYFirstLook Motion Poster | Bunny Vas | Vidya Koppineedi | Narne Nithiin, Nayan Sarika | Anji

‘ఆయ్’ అనే టైటిల్‌ను గమనిస్తే ఇది గోదావరి ప్రాంతవాసులు సాధారణంగా వాడే ఓ పదం. ఈ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌ను గమనిస్తుంటే అందమైన గోదావరి యొక్క నేపథ్యానికి వ్యతిరేకంగా ఆకర్షణీయమైన కథనాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ‘డ్రిజ్‌లింగ్ సమ్మర్’ అంటూ రిలీజ్ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోవటమే కాదు, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ ఉంటుందని తెలియజేస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జయిటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

Sharwanand : శర్వానంద్ బర్త్ డే స్పెషల్.. ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్

Exit mobile version