అల్లరి నరేష్ యమా ఫ్రెండ్లీ! తనకు కావల్సిన వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు అలీ కోసం మాట సాయం చేస్తున్నాడు. అలీ కథానాయకుడిగా నటించిన చిత్రం అలీబాబా ఒక్కడే దొంగ. ఈ సినిమా కోసం నరేష్ వాయిస్ ఓవర్ చెప్పాడు. నరేష్ గాత్రం ఈ సినిమాకి కలిసొస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. అల్లరోడి గొంతులో కథ, పాత్రల పరిచయం జరుగుతుందట. నరేష్‌కి వాయిస్ ఓవర్ చెప్పడం కొత్తేం కాదు. ఇది వరకూ ఇలాంటి సహాయాలు చేసినవాడే! అలీ సినిమాకి నరేష్ గాత్రం ఎంత వరకూ ప్లస్ అవుతుందో మరి.