తేడా ద‌ర్శకుడితో న‌రేష్‌

allari-nareshవీడు తేడా సినిమాతో మెగాఫోన్ ప‌ట్టారు చిన్ని కృష్ణ‌. అంతకు ముందు కొత్త బంగారులోకంలో స్టూడెంట్సూ.. కాస్త సైలెన్సూ హ‌డావుడి చేసిన మాస్టారు ఈయ‌నే. తొలి సినిమా ద‌ర్శకుడిగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అల్లరి న‌రేష్‌తో జ‌త క‌ట్టబోతున్నారు. న‌రేష్‌- చిన్ని కృష్ణ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంద‌ని టాలీవుడ్ టాక్‌. ఈ చిత్రానికి అర‌వ అమ్మిరాజు నిర్మాత‌. క‌థ పూర్తయింది. వినోదంతో పాటు కాస్త యాక్షన్ అంశాలూ ఉంటాయ‌ట‌. న‌రేష్ పై యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా వ‌ర్కవుట్ అవుతాయో చూడాలి. త్వర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.