నారా రోహిత్ సినిమా శంక‌ర‌

Wallpaper-1బాణం, సోలో సినిమాలతో గుర్తింపు తెచ్చుకొన్నాడు నారా రోహిత్‌. ఒక్కడినే సినిమా అత‌న్ని నిరాశ ప‌రిచింది. ఇప్పుడు శంక‌ర‌..గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నారా రోహిత్ స‌ర‌స‌ర రెజీనా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. తాతినేని స‌త్య దర్శకుడు. కె.ఎస్ రామారావు నిర్మాత‌. రొమాంటిక్ థ్రిల్లర్ త‌ర‌హాలో సాగుతున్న సినిమా ఇది. యాక్షన్ అంశాల‌కూ ప్రాధాన్యం ఉంది. మూడు పాట‌లు మిన‌హా టాకీ పూర్తయింది. ఈనెల 22 నుంచి పాట‌ల్ని తెర‌కెక్కిస్తారు. జూన్ మొదటి వారంలో ఆడియోని విడుద‌ల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌.