Site icon TeluguMirchi.com

నారా రోహిత్ ‘రౌఢీ ఫెలో’ !

nara-rohit-roudi-felloరచయితలు దర్శకులుగా మారడం.. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. ఈ జాబితాలోకి ఓ యువ పాటల రచయిత కూడా చేరుతున్నాడు. రాసినవి కొన్ని పాటలే అయినా, మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య.. త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ‘సోలో’ తో తన ఫాలోయింగ్ పెంచుకున్న యువ కథానాయకుడు నారా రోహిత్ నటించే చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు. కృష్ణ చైత్యన్య చెప్పిన కథ బాగా నచ్చడంతో అవకాశం ఇస్తున్నారట. ‘స్వామి రా రా’ చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నారా రోహిత్ నటించే ఈ చిత్రానికి ‘రౌడీ ఫెలో’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారట. ఈ చిత్రం జూన్ నెలలో ప్రారంభం కానునుంది

Exit mobile version