‘మాన్ కరాటే’ పట్టుకున్న నారారోహిత్…

nara-rohithబాణం చిత్రం తో తెలుగు తెర కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ , ఆ తర్వాత సోలో చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తమిళ్ మాన్ కరాటే చిత్రాన్ని తెలుగు రీమేక్ లో నటించడానికి రెడీ అయ్యాడు .

తమిళంలో స్పోర్ట్స్ కామెడీ గా వచ్చిన ఈ చిత్రం లో శివ కార్తికేయన్ పాత్ర ను నారా రోహిత్ చేస్తునాడు. ఇటీవల విడుదలైన ‘జోరు’ చిత్ర నిర్మాతలు అశోక్, నాగార్జునలు ఈ చిత్రానికి నిర్మాతలు గా వ్యవహరించనున్నారు. గుండెల్లో గోదారి చిత్ర దర్శకుడు కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మిగిలిన చిత్ర కాస్ట్ క్రూ వివరాలు అతి త్వరలోనే తెలియచేస్తారని టాక్.