Site icon TeluguMirchi.com

నాన్నకు ప్రేమతో జ్ఞాపకాలు…


గతంలో నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో తండ్రి తమకు ఏం చెప్పేవారో గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్. “” సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినపుడు నాకు ధైర్యం చెప్పి పంపించింది, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది, నామీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్న నందమూరి హరికృష్ణగారు. నాన్నెప్పుడూ మా ముగ్గురికీ ఒకటే చెప్పేవారు. కిందపడండి.. చావుదాకా వెళ్లిపోండి కానీ మిమ్మల్ని మీరే నమ్ముకుని పైకి రండి. ఏ రోజు కూడా పిరికి పందల్లా బతకడం నేర్పించలేదు ఆయన మాకు. ఏ రోజు కూడా ఆయన పేరు చెప్పుకుని, తాతగారి పేరు చెప్పుకుని బతికేలా నేర్పించలేదాయన. మీకు మీరుగా బతకండిరా మా ఆశీస్సులు ఎప్పుడూ మీకుంటాయని చెప్పారు “” అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

హరికృష్ణ గారు ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రేపు శంషాబాద్ ద‌గ్గ‌ర ఫాం హౌజ్‌లో హరికృష్ణ గారి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. త‌న‌యుడు జాన‌కీరామ్ అంత్య‌క్రియ‌లు జ‌రిగిన స్థ‌లంలోనే హరికృష్ణ ఆఖ‌రీ మ‌జిలి జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది.

Exit mobile version