Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : ‘విశ్వం’ నుంచి జర్నీ అఫ్ విశ్వం.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ ఎపిసోడ్ రిపీట్..
తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నాని పవర్ ప్యాక్డ్ లుక్ లో అదరగొట్టారు. రగ్గడ్ లో లుక్ లో చేతిలో వెపన్ పట్టుకుని పవర్ ఫుల్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. మూవీలో హైఆక్టేవ్ యాక్షన్ వుండబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ఇతర నటీనటులు. కాగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
Sanivaaramodi rampage ki siddham
Keep calm and get ready for the MASSive show he's about to deliver
#SaripodhaaSanivaaram#SuryasSaturday
Natural
@NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari… pic.twitter.com/RJR1vFwh1b
— DVV Entertainment (@DVVMovies) August 1, 2024