Site icon TeluguMirchi.com

#Nani30 ఫస్ట్ లుక్ & గ్లింప్స్‌ రిలీజ్ ఆరోజే..


ఇటీవలే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం తన 30వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి తాజాగా అప్డేట్ ను అందించారు మేకర్స్.

#Nani30 ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ జూలై 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక అనౌన్స్ మెంట్ వీడియో లో నాని పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలావుంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ‘హాయ్ నాన్న’, ‘హాయ్ డాడీ’, ‘హలో నాన్న’, ‘హలో డాడీ’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చెరుకూరి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. యూనిక్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version