నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజుల్లో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ ఈరోజు సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
Pawan Kalyan : నేను ‘ఓజీ’ అంటే మీరు ‘క్యాజీ’ అంటారు : పవన్ కళ్యాణ్
నాని ఈ పోస్టర్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్‌లో సూర్య(నాని) కనిపించిన తీరుకు ఇది కంప్లీట్ డిఫరెంట్ గా వుంది. చూస్తుంటే అటు మాస్, ఇటు క్లాస్ రెండు అవతారాల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నాడు నాని. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తుండగా, SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇకపోతే ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Vishwaksen : లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్
Every raging Saturday has its calm counterpart
Now, Experience a new dimension of Surya on other days
#SaripodhaaSanivaaram #SuryasSaturday
Natural
@NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya @JxBe@muraligdop @karthikaSriniva @SVR4446 @IamKalyanDasari… pic.twitter.com/UngM0bMWum
— DVV Entertainment (@DVVMovies) July 4, 2024