Site icon TeluguMirchi.com

Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ టీజర్ విడుదల.. అన్నీ ఆ ఒక్కరోజే !


నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. అయితే ఈరోజు నాని బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

నాని పాత్ర ప్రత్యేక స్వభావాన్ని సూచించే SJ సూర్య వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది, అతని పాత్ర పేరు సూర్య. ప్రతి మనిషిలాగే, హీరోకి కూడా కోపం వస్తుంది, కానీ అతను దానిని ప్రతిరోజూ చూపించడు. అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అతను జరిగిన సంఘటనలన్నింటినీ పేపర్‌పై వ్రాసి, శనివారాల్లో తనను ఇబ్బంది పెట్టేవారిని వేటాడడం ప్రారంభిస్తాడు. ఈ గ్లింప్స్ పోలీసుగా కనిపించిన SJ సూర్య, నాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడంతో ముగుస్తుంది. నాని క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసిన విధానం, టీజర్‌ని కట్ చేసిన విధానం ఆకట్టుకున్నాయి. జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేసారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.

SARIPODHAA SANIVAARAM Glimpse - Nani | Priyanka | SJ Suryah | Vivek Athreya | DVV Danayya

Exit mobile version