నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, థియేటర్లలో మాస్ ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న విడుదల చేస్తున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. హీరో నాని పిడికిలి బిగించి మరో చెత్తో రౌడీని పట్టుకున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది.