నాని రెండో సినిమా వివాదాల హీరోతో!

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా వరుస చిత్రాలతో దూసుకుపోతూనే చిన్న తరహా బడ్జెట్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాడు. నాని నిర్మాణంలో ఇప్పటికే ‘అ!’ చిత్రం వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కాగా ఈ చిత్రానికి అవార్డులు కూడా దక్కాయి. తక్కువ బడ్జెట్‌ తో నాని వరుస సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. తాను నిర్మించబోయే రెండో సినిమాకు తాజాగా హీరోని ఎంపిక చేశాడు. అయితే కథ ఏంటి, దర్శకుడు ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు.

‘ఫులక్‌ నుమా దాస్‌’ చిత్రంతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన విశ్వక్‌ సేన్‌తో నాని రెండో చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. విశ్వక్‌ ‘ఫలక్‌ నుమా దాస్‌’ ప్రమోషన్‌లో భాగంగా కాస్త వివాదాస్పదం అయ్యాడు కానీ నటన పరంగా అతని టాలెంట్‌ అందరికి నచ్చింది. అందుకే సురేష్‌ బాబు కూడా ఓ బాలీవుడ్‌ చిత్ర రీమేక్‌కు విశ్వక్‌ను హీరోగా ఎంపిక చేశాడు. నాని కూడా నిర్మాతగా తన రెండో చిత్రానికి ఈ వివాదాల హీరోనే ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.