నాని ఇప్పుడు మామూలు ఫామ్ లో లేడు. వరుస పెట్టి హిట్లు కొడుతున్నాడు.‘నేనులోకల్’ సూపర్ హిట్ తర్వాత నాని నుండి వస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది.
ఈ చిత్రంలోని ‘అడిగా అడిగా..’ అనే పాట టీజర్‌ను నాని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఓ చిన్న మ్యూజిక్ బిట్ నేపథ్యంగా ఉండే ఈ వీడియోలో నాని, నివేదా థామస్ సముద్ర తీరాన కూర్చొని కనిపించారు. ఇందులో ఫీల్ అదిరిపోయింది.
‘నిన్ను కోరి’ ఆల్బమ్‌లో ఈ పాట తనకు చాలా ఇష్టమని, తన కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ పాటని నానిట్వీట్ చేశాడు నాని. అంతేకాదు.. ప్రేమలో పడ్డవారికి, ప్రేమలో పడబోయే వారికి, ప్రేమలో పడి బయటపడిన వారికి ఇంకొన్ని రోజులు ఈ పాట లూప్‌లో ఉండబోతోందని ని కూడా చెబుతున్నాడీ నేను లోకల్ బాయ్.