Site icon TeluguMirchi.com

మహేష్‌తో పోటిపడుతున్న నాని.. సాహసమేనా!

naniనాచురల్‌ స్టార్‌ నాని వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. సక్సెస్‌లు అందుతున్నా కొద్ది నాని సినిమాల వేగం పెంచుతూ వస్తున్నాడు. ‘నేను లోకల్‌’ చిత్రంతో ఇటీవలె మంచి సక్సెస్‌ సాధించిన నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలు మొత్తం అమెరికాలో తెరకెక్కించామని నిర్మాత దానయ్య తెలిపాడు. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 17 నుండి వైజాగ్‌లో ప్రారంభించామని 29వరకు ఈ షెడ్యూల్‌ పూర్తవుతుందని దానయ్య చెప్పుకొచ్చాడు.

నాని ఒక వెరైటీ పాత్రలో నటించగా నివేధా థామస్‌ ఈ చిత్రంలో నాని సరసన నటిస్తోంది. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. చకాచకా షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది అని నిర్మాత ప్రకటించాడు. సరిగ్గా ఇదే సమయానికి మహేష్‌, మురుగదాస్‌ల ‘స్పైడర్‌’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంభోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అంతటి క్రేజ్‌ ఉన్న చిత్రంతో నాని పోటీ పడుతుంటే అభిమానులు కాస్త టెన్షన్‌ పడుతున్నారు. మహేష్‌తో పోటీ పడుతూ నాని సాహసం చేస్తున్నాడు అని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version