Site icon TeluguMirchi.com

నాని కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది !


ఇటీవలే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం తన 30వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చెరుకూరి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి తాజాగా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

నాని 30వ సినిమాకి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. అలాగే టైటిల్ గ్లింప్స్‌ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో గ్లింప్స్‌ చూస్తుంటే ఎమోషనల్ రైడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. తండ్రి, కూతురు ఒకరికోసం ఒకరు అనేట్లుగా సాగుతున్న ఈ ఎమోష‌న‌ల్ జ‌ర్నీలోకి మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇవ్వడం వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఇక హేష‌మ్ అబ్దుల్ వాహెబ్ అందించిన సంగీతం అద్భుతంగా వుంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hi Nanna Telugu Glimpse | Nani | Mrunal Thakur | Shouryuv | Hesham Abdul Wahab | Sanu John Varghese

Exit mobile version