విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని చిత్రం అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. ఈ చిత్రం గురించి మొదటి నుండి కూడా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఒక లేడీ గ్యాంగ్‌కు లీడర్‌గా నాని కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయిదు ఆరుగురు హీరోయిన్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే అవేవీ ఇందులో ఉండవని టీజర్‌ను బట్టి అర్థం అయ్యింది. అంత మంది హీరోయిన్స్ అయితే లేరు కాని అయిదుగురు సభ్యులు కలిగిన ఒక లేడీ గ్యాంగ్‌కు నాని హెల్ప్ చేయడం మాత్రం సినిమాలో చూపించడం జరిగింది.
సీరియస్ కథను ఎంటర్టైన్మెంట్తో చూపించబోతున్నారు. టీజర్ నిమిషం ఇరవై సెకన్లు ఉంది. అందులో నానితో పాటు ఆ అయిదుగురు గ్యాంగ్‌ను కూడా చూపించారు. అసలు స్టోరీ ఏంటీ రివీల్ కాకుండా సినిమా ఎంటర్టైన్మెంట్తో సాగబోతుందని చెప్పకనే చెప్పాడు. ఆ లేడీ గ్యాంగ్ పగను నాని ద్వారా తీర్చుకోబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఆర్ఎక్స్ 100 చిత్ర హీరో కార్తికేయ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అతడు ఫార్ములా వన్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. అతడే విలన్ అయ్యి ఉంటాడని కూడా టీజర్‌ను బట్టి అనిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. సినిమాను ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటే సాహో వచ్చి పడింది. సెప్టెంబర్ రెండవ వారంకు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.