నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని ఆగస్టు 30వ తేదీన విడుదల చేయాలని భావించారు. కాని ఆగస్టు 15న విడుదల అవ్వాల్సిన సాహో చిత్రాన్ని ఆగస్టు 30వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించారు. సాహో చిత్రం విడుదల వాయిదా పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగస్టులో గ్యాంగ్ లీడర్ విడుదల లేనట్లే అని తేలిపోయింది. ముందుగా విడుదల చేయాలంటే సినిమా ఇంకా వర్క్ పూర్తి కాలేదు. కనుక రెండు వారాల ఆలస్యంగా సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.
గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఫిక్స్ చేశారు. మరో వారం రోజుల్లో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడంతో పాటు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించాలని కూడా నాని అండ్ టీం భావిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంతో నాని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని ఒక లేడీ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.