సాహో చిత్రం ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆగస్టు 30న విడుదల చేయబోతున్నట్లుగా స్వయంగా యూవీ క్రియేషన్ నిర్మాతలు ప్రకటించారు. దాంతో గ్యాంగ్ లీడర్ విడుదల ఇబ్బందుల్లో పడ్డట్లయ్యింది. మంచి టైం అనుకుని ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటే ఆ డేట్ను చెప్పా పెట్టాకుండా సాహో టీం తీసేసుకోవడంతో నాని అండ్ టీం ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. సాహసం చేసి అదే తేదీలో విడుదల చేస్తే ఆత్మహత్య సదృష్యం అవుతుంది. అందుకే మరో మంచి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దసరా బరిలో పెద్ద సినిమాలు ఉన్న కారణంగా ఫలితం ఎలా ఉంటుందో అనే టెన్షన్ కూడా ఉంది. పాపం గ్యాంగ్ లీడర్కు పెద్ద కష్టం వచ్చింది.