అమెరికాలో ‘గ్యాంగ్‌ లీడర్‌’ పరిస్థితి ఏంటీ?

నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. ఇక అమెరికాలో ఈ చిత్రం కాస్త యావరేజ్‌ అంచనాలతో విడుదలైంది. కాని సినిమాకు మంచి టాక్‌ రావడంతో వసూళ్లు బాగా నమోదు అవుతున్నాయి. నేడు రేపు ఎక్కువ స్క్రీన్స్‌లలో సినిమాను ప్రదర్శించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలో ఈ చిత్రం మొదటి రోజు గౌరవ ప్రధమైన ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇక మొదటి వారంలో ఈ చిత్రం ఏ మేరకు రాబడుతుందో అనే ఆసక్తి నెలకొంది.

మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి ఈ చిత్రం 3.5 లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. నాని గత చిత్రం జెర్సీ 4.1 లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. జెర్సీ చిత్రంతో పోల్చితే జెంటిల్‌మన్‌ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను అక్కడ రాబట్టలేదు. కాని జెర్సీ చిత్రం కంటే లాంగ్‌ రన్‌లో గ్యాంగ్‌ లీడర్‌ ఎక్కువగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రం కనెక్ట్‌ అయ్యేలా ఉంది. మొదటి వారాంతంలో మిలియన్‌ మార్క్‌ను దాటనుందా అనేది చూడాలి. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం రెండు మిలియన్‌ డాలర్లను సాధిస్తే సూపర్‌ హిట్‌గా నిలిచినట్లే.