దిల్ రాజు ఫై నాని ఆగ్రహం ..?

నేచురల్ స్టార్ నాని..సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్రబ్యూటర్ దిల్ రాజు ఫై కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరెక్షన్లో టక్ జగదీష్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 16 న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అదే రోజున శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

టక్ జగదీష్ సినిమా మీద లవ్ స్టోరీ సినిమా డేట్ వేసారని నాని షాక్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసలు నాని వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.