శ్యామ్ సింగ్ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నాని..తాజాగా తన కొత్త చిత్రం దసరా లో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా…శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పెద్ద పల్లి జిల్లాలోని గోదావరి ఖనిలో జరుగుతోంది. హీరో నానిచ కీర్తి సురేష్ పాల్గొనగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఓ భారీ సెటప్ తో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు.
బొగ్గుగని నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ పాట కోసం టీమ్ అంతా ఎండను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తోంది. భారీ గ్రాండ్ స్కేల్ లో చిత్రీకరిస్తున్న ఈ పాట లో 500 డాన్సర్ లు పాల్గొంటున్నారు. దీంతో ఈ సాంగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మాసీవ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో వహీదా రెహమాన్ సముద్రఖని సాయి కుమార్ రోషన్ మాథ్యూ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.