Nani : రివ్యూలపై నేచురల్ స్టార్ నాని కీలక వ్యాఖ్యలు


టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్-3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, హిట్ సిరీస్‌లో భాగంగా మూడవ చిత్రం. ఇటీవలే హిట్-3 ట్రైలర్ విడుదలై యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమాలో నాని వయోలెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న నాని, గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన రివ్యూల అంశంపై స్పందించారు. సినిమా విడుదల రోజు రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని అన్నారు.

Also Read :  TFPC : పహల్గామ్ బాధితులకు మద్దతుగా ఫిలింనగర్ లో కొవ్వొత్తుల ర్యాలీ

రివ్యూలు ఇవ్వడంపై ఎందుకు ఆగాలి? ఒకరిని ఆపడం ఎలా సాధ్యం? రెండేళ్లు కష్టపడి సినిమా తీస్తే.. రెండు గంటలు చూసి బాలేదు అని చెప్పడం మంచిది కాదు. కాకపోతే సినిమాపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సినిమా ఆడదు, డిజాస్టర్ అని ఒక్కరోజులో ఎలా చెప్పగలరు? చాలా సినిమాలకు ఫస్ట్ షోకే ఇలాంటి రివ్యూలు చెప్పడం చూస్తున్నాను. సినిమా విడుదలైన తర్వాత పదిహేను రోజులు ఎవరూ చూడకపోతే, అప్పుడు డిజాస్టర్ అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ డే మార్నింగ్ షో కంటే ముందే ఆ మాట చెప్పడం తప్పు. అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఓకే, కానీ మీడియా ప్రొఫెషనల్స్ వెంటనే డిసైడ్ చేసి సినిమాలను రివ్యూలు రాయడం కరెక్ట్ కాదు. ఇది ప్రేక్షకుల మైండ్ ను ఛేంజ్ చేస్తుంది. ఒక సినిమా బయటకు వచ్చాక, ఒక వారం తర్వాత, కలెక్షన్లు తగ్గితే, ప్లాప్ అంటాం అని నాని చెప్పుకొచ్చారు.

Also Read :  Sree Vishnu : శ్రీ విష్ణు 'సింగిల్' రిలీజ్ డేట్ లాక్ !!