ప్రియ, విక్రమ్‌ల రిలేషన్‌ నానికి కూడా తెలియదట!

దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ప్రత్యేక మార్క్‌తో చిత్రీకరించి తక్కువ కాలంలోనే మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’ సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర సక్సెస్‌ను కూడా విక్రమ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నానికి మరో సక్సెస్‌ లభించింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో నాని, విక్రమ్‌ కుమార్‌, హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌లు హాజరయ్యారు. ఈ ఇంటర్య్వూలో భాగంగా విక్రమ్‌, ప్రియల రిలేషన్‌ గురించి టాఫిక్‌ వచ్చింది.

విక్రమ్‌ తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా ప్రియ పేరు ఉంటుంది. అయితే ఇంతకి ఈ ప్రియ ఎవరు అని ప్రశ్నించగా దానిని దాటవేస్తూ… ప్రియ ఒక మంచి పేరు, ఆ పేరు వింటుంటే నాకు హాయిగా ఉంటుంది అంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై నాని స్పందిస్తూ నేను కూడా ఈ కథేంటి అని అడిగాను కానీ క్లారిటీ ఇవ్వలేదని అన్నాడు. హీరోయిన్‌ ప్రియాంక మాత్రం తనకు తెలుసన్నది. దాంతో నాని విక్రమ్‌పై అలిగారు. నాకు చెప్పకుండా తనకు ఎలా చెప్పారు అంటూ కాసేపు ఆటపట్టించారు. ఇంత చేసినా కూడా తనకు, ప్రియకి గల రిలేషన్‌ ఏంటి అనేది మాత్రం నోరు విప్పలేదు.