ప్రముఖ టీవీ ఛానెల్లో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి తాజాగా నాచురల్ స్టార్ నాని అతిథిగా వెళ్లాడు. సదరు కార్యక్రమంలో నాని చిన్ననాటి విషయాలను గురించి అడిగి తెలుసుకున్న చిరు ఒక విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నాని చిన్న తనంలో చిరు నటించిన ‘మాస్టర్’ సినిమా కోసం సైకిల్‌పై వెళ్లాడట. టికెట్టు దొరికిన సంతోషంలో తన సైకిల్ పోయిన విషయమే మరిచాడట. అంతేకాకుండా ఆ సినిమాని చూసిన తర్వాత సైకిల్ పోయిన బాద కూడా లేదని నవ్వుతూ చెప్పాడు. అనంతరం ఈ షోలో గెలుచుకున్న డబ్బుతో తాను కొత్త సైకిల్ కొనుకుంటాను అని నాని సరదాగా అన్నాడు.
నాని మాటలను విన్న తర్వాత చిరంజీవి నో నా సినిమా చూడడానికి వెళ్లి సైకిల్ పోగొట్టుకున్నావు కనుక నేనే ఆ సైకిల్‌ను కొనిస్తాను అంటూ మాట ఇచ్చారట. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నానికి కొత్త సైకిల్‌ను కొన్ని పంపిచారట. చిరు పంపిన చిరు బహుమతిని స్వీకరించిన నాని సంబ్రమాశ్చర్యంలో చిరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సైకిల్ పోగొట్టుకున్న ఆ బాలుడి సైకిల్ తిరిగి వచ్చింది అని సంతోషంతో సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశాడు. చిరు ఆ సైకిల్ పంపి మాట నిలబెట్టుకోగా నాని సంభ్రమాశ్చర్యానికి గురి అయ్యాడు.