Site icon TeluguMirchi.com

నెక్స్ట్ లెవెల్లో కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్..!


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. బ్రిటిష్ కాలం నాటి ఓ గూఢచారి కథగా ఈ సినిమా రాబోతుంది. ఇక సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నవీన్ మేడారం తెరకెక్కిస్తుండగా, అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ గ్లింప్స్ చాల ఆసక్తికరంగా వుంది. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలంలోని ఒక గూఢచారిగా కనిపిస్తాడు. అంతేకాదు తన బాడీ లాంగ్వేజ్, అలాగే డైలాగ్ డెలివరీ చాలా పర్ఫెక్ట్ గా వున్నాయి. ముఖ్యంగా ‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడలో వున్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు.. అదే గూఢచారి లక్షణం’ అంటూ కల్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ బాగుంది. ఇక విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా చక్కగా కుదిరాయి. మొత్తానికి ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాకి శ్రీకాంత్ విస్సా కథను అందించగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Devil - The British Secret Agent Glimpse | Nandamuri Kalyan Ram | Samyuktha Menon | Abhishek Nama

Exit mobile version