కళ్యాణ్ రామ్ స్పీడ్ మాములుగా లేదుగా ?


నందమూరి కళ్యాణ్ రామ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటారు. యువ దర్శకులు, వైవిధ్యమైన కథలతో ఆయన చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. గతేడాది వచ్చిన ‘బింబిసార’ సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు(జులై 5) సందర్భంగా అతని కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని మేకర్స్ బర్త్ డే గిఫ్ట్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్న ‘డెవిల్’ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా, ఇప్పుడు మరో కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది.

అదేంటంటే కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్ చేశారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

కళ్యాణ్ రామ్ తన పంచ్ పవర్‌ను చూపించే మాస్-ఆపీలింగ్ పోస్టర్ ద్వారా ఈ చిత్రం అవుట్-అండ్-అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించడానికి ప్రదీప్ చిలుకూరి ఆకట్టుకునే కథను రాశారు. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. హరికృష్ణ భండారి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.