Site icon TeluguMirchi.com

పోలీస్ స్టేషన్ బాట పట్టిన నందమూరి హీరోలు…

nandhamuri-herosఈ ఏడాది నందమూరి నామ సంవత్సరంగా కావాలని కోరుకుంటున్న నందమూరి ముగ్గురు హీరోలు పోలీస్ గెటప్స్ తో అబిమానులను అలరించనున్నారు. బాక్సాపీసు ద‌గ్గర ఈసారైనా త‌న మార్క్ చూపించాల‌ని ‘పటాస్’ చిత్రంతో ఈ నెలలోనే రానున్నాడు కళ్యాణ్ రామ్. ఆ వెనుకే టెంప‌ర్ గా పిబ్రవరి లో తన సత్తా చూపించాలని రెడీ గా ఉన్నాడు ఎన్టీఆర్. లెజెండ్‌తో మాంఛి ఫామ్ లో ఉన్న బాల‌య్య వేసవిలో లయన్ గా రాబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సిబిఐ ఆఫీసర్ గా, ఎన్కౌంటర్ స్పెషల్స్ట్ దయా గా ఎన్టీఆర్ , ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ఇలా తమ అబిమాన నటులు పోలీస్ గెటప్స్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తారని అబిమానులు కొండత ఆశ తో ఉన్నారు. మరి ఎంతవరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవుతారో చూడాలి.

Exit mobile version