Site icon TeluguMirchi.com

అందరి మంచి కోరుకునే కుటుంబం

ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లండి. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉంటారు’ అని తమ ప్రతి సినిమా ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ అభిమానులను ఉద్దెశించి చెప్పేవారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఒక బాధాకరమైన సంఘటన జరగడంతో, తమను చూసేందుకు వచ్చే అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో వారిరువురూ కార్యక్రమం చివర్లో ఇలా చెబుతుంటారు.

2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఈ సోదరులు ప్రజలను చైతన్య పరిచేలా జాగ్రత్తలు చెప్తుండడం గమనిస్తూనే ఉంటాం.

జానకిరామ్ మృతి తర్వాత ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తమ సినిమాలు ప్రారంభమయ్యే సమయంలో ‘‘రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీమీదే ఆశలు, మీమీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం, ఏ కుటుంబంలోనూ జరగకూడదని ఆశిస్తున్నాము’’ అంటూ ఓ సందేశాన్ని ఇస్తున్నారు. అలా అందరి మంచి కోరుకునే కుటుంబంలో మరో విషాదం జరగడం అందరనీ చాలా బాధకు గురిచేస్తుంది.

Exit mobile version