Site icon TeluguMirchi.com

NBK 109 Glimpse : హంటింగ్ మొదలెట్టిన బాలయ్య..


వరుస విజయాలతో మంచి జోష్ లో వున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో #NBK109 సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా నేడు మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Kalki 2898 AD : భైరవ గా ప్రభాస్.. లుక్ అదుర్స్ !

ఈ గ్లింప్స్ బాలయ్య మాస్ యాక్షన్, డైలాగ్స్ తో పవర్ ఫుల్ గా వుంది. ‘ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటూ విలన్ అడిగిన ప్రశ్నకు.. సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో తనదైన శైలిలో అదరగొట్టారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలను..ఈ గ్లింప్స్ మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

NBK 109 First Glimpse | Nandamuri Balakrishna | Bobby Kolli | Thaman S | S Naga Vamsi

Exit mobile version