రెగ్యులర్ షూటింగ్‌కు మాత్రం టైం కలిసి రావడం లేదు. గత రెండు నెలలుగా ఈ చిత్రం అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆగస్టు 7న సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. సినిమాలో బాలయ్య రెండు పాత్రలను పోషించబోతున్నాడు. అందులో ఒకటి పోలీసు ఆఫీసర్ పాత్ర కాగా, రెండవది నెగటివ్ టచ్ ఉన్న రోల్ అవ్వడం విశేషం. ఇక ఈ చిత్రం కోసం సోనాల్ చౌహాన్‌ను ఒక హీరోయిన్గా ఎంపిక చేయగా మరో హీరోయిన్ రేసులో చాలా మంది ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో బాలయ్యకు జోడీ ఎవరు కాబోతున్నారో చూడాలి. ఆగస్టులో ప్రారంభించి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని బాలయ్య కోరుకుంటున్నాడు. మరి సాధ్యం అయ్యేనా చూడాలి.