102కు అప్పుడే క్యూ..!

balakrishna 102 film
నందమూరి బాలకృష్ణ ఇటీవలే సంక్రాంతి కానుకగా తన 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించి ఆ సినిమా రికార్డుల మోత మ్రోగించింది. దాంతో అదే రేంజ్‌లో తన తర్వాత సినిమాలు కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో బాలయ్య చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. తాజాగా బాలయ్య 101వ సినిమాకు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఫిక్స్‌ అయిన విషయం తెల్సిందే. అతి త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలోనే బాలయ్య 102వ సినిమా గురించి ప్రచారం జోరుగా సాగుతుంది.

బాలయ్యతో ఆయన 102వ సినిమాను చేసేందుకు ముగ్గురు దర్శకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో మొదటి వారు తమిళ దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌. ఈయన 101వ సినిమాకే దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే బాలయ్యకు పూరి చెప్పిన కథ ఎక్కువగా నచ్చడంతో అటు మొగ్గాడు. 102వ సినిమాకు అయినా బాలయ్య ఛాన్స్‌ ఇస్తాడేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

ఇక మరో వైపు కృష్ణవంశీ కూడా ‘రైతు’ను పట్టుకుని బాలయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరితో పాటు బోయపాటి శ్రీను కూడా బాలయ్య కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిలో బాలయ్య ఎవరికి తన 102 ఛాన్స్‌ ఇస్తాడో చూడాలి. వీరి ముగ్గురిలో కాకుండా ఆ సమయంక మరి కొందరు కూడా లిస్ట్‌లో జాయిన్‌ అయ్యే అవకాశాలున్నాయి.