టీడీపీ వ్యవస్థాపకులు..మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు జూ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళ్లు అర్పించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.
అయితే, కటుంబ సభ్యుల కంటే ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ – తారక్ ఇద్దరూ నివాళి అర్పించి వెళ్లిపోయారు. ఇటు..నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో శత జయంతి వేడుకలను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం నిమ్మకూరు చేరుకున్న బాలయ్య..ఈ ఉదయం గ్రామంలోని దేవాలయంలో పూజలు చేసారు.