వరుస హిట్స్ దిల్ రాజు కాస్త లాభాల రాజు అనిపించుకున్న రాజు కు గట్టి దెబ్బె పడిందని తెలుస్తుంది. దిల్ రాజు కు తిరుపతి వెంకన్న అంటే అమితమైన ఇష్టం..అందుకే తాను నిర్మించిన ప్రతి సినిమా హిట్ కావాలని ఆ తిరుమల వెంకన్న కోరుకోవడమే కాదు, ఆ సినిమా హిట్ కాగానే తలా వెంట్రుకలు ఇచ్చి వస్తాడు..అంతే ఎందుకు తన సొంత ఊరి లో ఓ వెంకన్న ఆలయాన్ని సొంత డబ్బులతో కట్టించడంటే మనమే అర్ధం చేసుకోవాలి రాజు కు ఎంత ఇష్టమో…
తాజాగా అలాంటి వెంకన్న మీద సినిమాగా వచ్చిన ఓం నమో వెంకటేశాయ నైజాం రైట్స్ ను రూ. 8 కోట్లకు కొనుగోలు చేసాడు. కానీ ఇప్పుడు ఆ సినిమా అనుకున్నంత విజయం దక్కకపోగా , నాగ్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా తేలిపోయింది. వరల్డ్ వైడ్ గా మొత్తం వారం కలెక్షన్స్ రూ. 12 కోట్లు వచ్చాయంటే అర్ధం చేసుకోవాలి సినిమా ఎలా ఆడిందో..ఈ సినిమా తో దిల్ రాజు కు గట్టే దెబ్బె తగిలిందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు.
సంక్రాంతి బరిలో సూపర్ హిట్ అయినా శతమానం భవతి , తాజాగా నేను లోకల్ చిత్రాలతో వచ్చిన లాభం లో సగం వరకు ఓం నమో వెంకటేశాయ తో పోయాయని అంటున్నారు. ఇక ఈ వార్త తెలిసిన మరికొంతమంది రాజు కు ఏ పర్లేదు..నెక్స్ట్ అల్లు అర్జున్ డీజే ఉంది కదా దానితో అన్ని వస్తాయని అంటున్నారు. చూద్దాం రాజు కు ఎలాంటి లాభం వస్తుందో..