మెగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక..హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతుంది. ఇప్పటికి వరకు రెండు , మూడు సినిమాలు చేసినప్పటికీ అవేవి కూడా సక్సెస్ కాలేకపోయాయి. కాగా ఓ విషయం మాత్రం మెగా అభిమానులను , ప్రేక్షకులకు కాస్త కలవరపెడుతుంది. అదే నిహారిక – నాగ శౌర్య ప్రేమలో ఉన్నారనేది..వీరిద్దరూ కలిసి ఒక మనసు అనే సినిమా చేసారు. ఈ సినిమా షూటింగ్ టైం లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.
తాజాగా నిహారిక ఓ చిన్నారిని ఎత్తుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, దానిపై నాగశౌర్య కామెంట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పుకార్లు మళ్లీ మొదలు అయ్యాయి. దీంతో మరోసారి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు నాగశౌర్య. తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారంలేదని చెప్పేశాడు. నిహారికతోనే కాదు, తనకు ఏ అమ్మాయితోనూ లవ్ అఫైర్ లేదని స్పష్టం చేశాడు. నిహారికను తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఖరికి, ఫ్రెండ్స్ కూడా “మీ లవ్ స్టోరీ చెప్పు” అంటూ ఫోన్లు చేస్తున్నారని నాగశౌర్య ఫీల్ అయ్యాడు.