Site icon TeluguMirchi.com

ఆకట్టుకుంటున్న ‘రంగబలి’ ట్రైలర్ !


యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ తో వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ తో పాటు మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.

హీరో తన ఊరు పై తనకు ఉన్న అభిమానానికి గల కారణాన్ని చెప్పడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. బయట ఊరిలో ఎలా ఉన్నా పర్వాలేదు.. సొంత ఊరిలో మాత్రం సింహంలా ఉండాలి అని నమ్ముతాడు. ఇక హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఊర్లో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనేదే సినిమా కథ.

#Rangabali Trailer | Naga Shaurya | Pawan Basamsetti | YuktiThareja | Pawan Ch | In Cinemas July 7th

ఇకపోతే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కి పేరుపొందిన శౌర్య మరోసారి ఆకట్టుకున్నారు. పవన్ బాసంశెట్టి తన రైటింగ్, టేకింగ్‌ తో ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్ అన్నీ ఉన్నతంగా వున్నాయి. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది.

Exit mobile version