యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రంగబలి’. జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో కమెడియన్ సత్య చేసిన కామెడీ మాత్రం కొంతవరకు అలరించగా, సెకండ్ ఆఫ్ మాత్రం తేలిపోయింది. అందుకే విడుదలయ్యి నెల రోజులు కూడా కాకుండానే ‘రంగబలి’ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ లో ‘రంగబలి’ సినిమా ఈరోజు(ఆగస్టు 4) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించగా, పవన్ సి హెచ్ సంగీతం అందించారు.