ఇంటి కెప్టెన్ అన్నప్పుడు ఖచ్చితంగా బిగ్‌బాస్ ఇంటి నియమాలను ఇంటి సభ్యులు అంతా కూడా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోవాలి. అలాగే ఇంటి సభ్యులు అంతా కూడా ఎలాంటి గొడవ పడకుండా చూసుకోవాలి. కాని బాబా భాస్కర్ మాత్రం అన్ని విషయాలను చాలా సరదాగా తీసుకోవడంతో పాటు అన్ని విషయాల పట్ల లైట్‌గా ఉంటున్నాడని, కెప్టెన్‌గా స్ట్రిక్ట్‌గా ఉండకుంటే సీరియస్‌గా పరిస్థితి ఉంటుందని హెచ్చరించాడు. దాంతో బాబా మాస్టర్ కాస్త సరే ఇకపై జాగ్రత్తగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.