బాబాకు సున్నితంగా నాగ్‌ వార్నింగ్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఏడవ వారంలో ఇంటి కెప్టెన్‌గా బాబా భాస్కర్‌ ఎంపిక అయిన విషయం తెల్సిందే. ఆయన కెప్టెన్‌గా అయిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు పనులు చేసుకోవచ్చు, పడుకుంటే పడుకోవచ్చు ఏం చేయాలన్నా చేయవచ్చు. ఇంగ్లీష్‌లో పాటలు పాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఏమైనా చేసుకోవచ్చు అంటూ ఇంటి సభ్యులకు అవకాశాలు ఇచ్చాడు. తాజాగా ఆ విషయమై నాగార్జున ప్రశ్నిస్తూ అలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అన్నాడు.

ఇంటి కెప్టెన్‌ అన్నప్పుడు ఖచ్చితంగా బిగ్‌బాస్‌ ఇంటి నియమాలను ఇంటి సభ్యులు అంతా కూడా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోవాలి. అలాగే ఇంటి సభ్యులు అంతా కూడా ఎలాంటి గొడవ పడకుండా చూసుకోవాలి. కాని బాబా భాస్కర్‌ మాత్రం అన్ని విషయాలను చాలా సరదాగా తీసుకోవడంతో పాటు అన్ని విషయాల పట్ల లైట్‌గా ఉంటున్నాడని, కెప్టెన్‌గా స్ట్రిక్ట్‌గా ఉండకుంటే సీరియస్‌గా పరిస్థితి ఉంటుందని హెచ్చరించాడు. దాంతో బాబా మాస్టర్‌ కాస్త సరే ఇకపై జాగ్రత్తగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.