నాగార్జున చాలా రోజులుగా కొడుకులు ఇద్దరితో ఒక మల్టీస్టారర్‌ను చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం కథలు రెడీ చేయమని పలువురికి సూచించాడు. ఇప్పుడు ఆ బాధ్యతను రాహుల్ రవీంద్రన్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. మన్మధుడు 2 చిత్రం హిట్ అయితే ఖచ్చితంగా అక్కినేని మల్టీస్టారర్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. మూడవ సినిమాతోనే మంచి మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్నందుకు రాహుల్ లక్కీ అని చెప్పాలి. చైతూ, అఖిల్ హీరోలుగా నటించబోతున్న చిత్రంలో నాగ్ గెస్ట్ రోల్ కూడా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రాహుల్‌కు అక్కినేని మల్టీస్టారర్ బాధ్యతలు
