సాదారణంగా డాన్స్‌తో మొదలు పెట్టే నాగార్జున డాన్సర్స్ డాన్స్ వేస్తుంటే అక్కర్లేదు మీరు వెళ్లండి. ఈ రోజు చాలా సీరియస్‌గా ఇంటి సభ్యులతో మాట్లాడాలి అంటూ డాన్సర్స్‌ను పంపించడం జరిగింది. నాగార్జున మరీ ఇంత సీరియస్ అవ్వడంతో ఇంటి సభ్యులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలేం జరిగి ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున నేటి ఎపిసోడ్లో ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయం చర్చనీయాంశం అయ్యింది. మరి కొన్ని గంటల్లో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌పై అందరి దృష్టి కెంద్రీకృతం అయ్యింది.